ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 11: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడరం కేంద్రంలో ప్రభుత్వం ఐటిడిఎ ఆధ్వర్యంలో టూరిజం అభివృద్ధి పేరుతో ప్రజాప్రతినిధులు,ఆదివాసీ సంఘాలతో వర్క్ షాప్ నిర్వహించారని వర్క్ షాప్ ఉద్దేశం ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులైన మైనింగ్ వనరులు,అటవి ఉత్పత్తులు,సుగంధ ద్రవ్యాలు,అటవి భూములు టూరిజం అభివృద్ధికి ప్రయివేట్ సంస్థలకు దారాదత్తం చెయ్యడానికేనని ప్రభుత్వాన్ని విమర్శించారు.
వర్క్ షాప్ లో పాల్గొన్న ఆదివాసీ గిరిజన సంఘం టూరిజం అభివృద్ధి పేరుతో 1/70 చట్టాన్ని ఉల్లంఘన జరుగుతుందని వ్యతిరేకించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని సవరించి ఏజెన్సీలోని అపారమైన సహజ వనరులు దారదత్తం చెయ్యడానికి కుట్ర జరుగుతుందని, ఏజెన్సీలో 1/70 చట్టం అమలులో ఉండగ ప్రయివేట్ సంస్థలకు టూరిజం అభివృద్ధికి భూములు,మైనింగ్ వనరులు,అటవి ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాలు ప్రయివేట్ సంస్థలకు ఏట్ల కేటాయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గతంలో 1/70 చట్టం సవరించాలని రాష్ట్ర స్పీకర్ ప్రకటించారని స్పీకర్ ప్రకటనను వ్యతిరేకంగా ఆదివాసులు తిరుగుబాటు చేసిన ఫలితంగా 1/70 చట్టం అమలుకు కట్టుబడి ఉన్నట్లు ఆదివాసీల ఆగ్రహాన్ని చల్ల ర్షడానికి ప్రకటన తప్ప నిజమైన 1/70 చట్టం పరిరక్షణ ప్రకటన కాదని తేలిపోయింది.
రాష్ట్ర అసెంబ్లీలో ఆదివాసీ ప్రజాప్రతినిధుల ద్వార గిరిజనేతరులకు ఇల్లాస్థలాలు ఇవ్వాలని ప్రకటన చేయిస్తున్నారు. దీనిని బట్టి 1/70 చట్టాన్ని సవరించి ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులు ప్రవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు “టూరిజం అభివృద్ధి” ముద్దుపేరు పెట్టారని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర డిప్యూటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకులోయ పర్యటనలో కూడ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ప్రకటన వెనకల ఏజెన్సీలో 1/70 చట్టం సవరణకు కుట్ర జరుగుతుందని అందులో భాగంగా ప్రభుత్వం టూరిజం అభివృద్ధి పేరుతో ప్రజాప్రతినిధులతో టూరిజం వర్క్ షాప్ పెడుతున్నారని ప్రభుత్వా గిరిజన వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా ఖండించారు.
టూరిజం అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులు ప్రవేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్రను ఆదివాసీ గిరిజన సంఘం తిప్పికొడుతుందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాము 1/70 చట్టం పరిరక్షించాలని డిమాండ్ చేశారు.టూరిజం, అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులు ప్రవేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలు విరమించి 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం అరకువేలి మండల నాయకులు పీ.రామన్న,కె.మగ్గన్నా.కె.రాము పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


