Chittam Murali : ప్రయత్నం చిన్నదే కావచ్చు కానీ ఆశయం పెద్దది డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ అనంతగిరి ఏప్రిల్ 11: జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ గిరిజన యువత లో గత దశాబ్ద కాలంలో అనేక రంగాలలో అభివృద్ధి చెందడంతో పాటుగా మత్తుపదర్దాల జాడ్యం కూడా వారిని మహమ్మరీలా నిర్వీర్యం చేస్తోంది కన్నవారికి కడుపుకోత మిగుల్చుతుంది. సాధారణంగా పర్యాటక ప్రాంతాలు కావడం అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోవడం రకరకాల మత్తు పదర్దాల వినియోగం గిరిజన యువతలో నానాటికీ పెరుగుతూ, నేడు అదుపు చేయలేని పరిస్తితికి చేరుకుంది. మేము ఈ పరిస్థితులను అరికట్టాలని గ్రామాలలో యువత కి అవగాహన కల్పిస్తూ వారికి చైతన్యం కలిగిస్తున్నాం స్వచ్ఛమైన గిరిజన ప్రాంతంలో నేడు ఇటువంటి స్థితికి చేరుకోవడం మమ్మల్ని బాధిస్తుంది.

గిరిజన మేధో వర్గం ఇటువంటి జాతి నిర్విర్యపు లక్షణాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు,వారి ఆలోచన విధానానికి అనుచరించి అభిరుచికి అనుగుణంగా క్రీడల్లో ప్రోత్సహించడం,వృత్తి నైపుణ్య అభివృద్ధి పనులపై,కోర్సులపై శిక్షణనిచ్చి వారికి శాశ్వత ఉపాధినీచ్చేల చొరవ తీసుకునేలా ఆలోచన చేయాలని విన్నవిస్తున్నాము. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తూ జిల్లా లో అనేక కార్యక్రమాలు చేస్తోంది.మావంతుగా స్థానిక మండల పోలీస్ శాఖ అధికారులతో కలిసి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సమాజం కోసం అవగాహన కల్పిస్తూ గిరిజన యువత చెడు వ్యసనాలకు త్యజించి మంచి భవిష్యత్ నీ కాంక్షించాలని కోరుకుంటున్నాము.

ఇందులో భాగంగా బుధవారం నాడు అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ డి.శ్రీనివాసరావు తో కలిసి ఎగువశోభా పంచాయితీ జాంగూడా గ్రామా యువతకు,వారి కెప్టెన్ మధుకి క్రీడ ప్రోత్సాహకంగా క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది.ప్రయత్నం చిన్నదే కావచ్చు కానీ ఆశయం పెద్దది డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు,కొర్ర రవి,పాంగి లక్ష్మణ్,తెలుగు దేశం పార్టీ నాయకుడు సోమేల గురుమూర్తి,గ్రామ పెద్దలు చిన్నయ్య, లచ్చన్న, మంగళయ్య, సోమేల గాసి, పాంగి చిన్న సోమ్రా, సాగర రాజు, జగన్నాధం, సుందర్ రావు, అప్పన్న, మహేష్, సురేష్,దేవదాస్,యవత. మహిళ లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A drug-free society

You cannot copy content of this page

Scroll to Top