కూకట్పల్లి జనవరి 31 (త్రినేత్రం న్యూస్) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ, టీపీసీసీ లేబర్ సెల్ శేర్లింగంపల్లి అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదర్‌నగర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ సంజీవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని, కేంద్రం 60 శాతం నిధులు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఇవ్వాలని నిర్వీణ్యం చేసేలా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎండి ఫయాజ్ లేబర్ సెల్ హైదర్ నగర్ అధ్యక్షుడు, సాద టిడిపి మహేష్, సాజిద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


