Temple Inauguration : ఆలయ ప్రతిష్ట లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం నర్సాపురం గ్రామంలో *శ్రీశ్రీశ్రీ జానకి సమేత కోదండ రామచంద్ర స్వామి లక్ష్మణ ఆంజనేయ స్వామి ముత్యాలమ్మ అమ్మవారు బొడ్రాయి పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కాంగ్రెస్ నాయకుడు మాజీ జడ్పిటిసి బత్తుల అంజి, ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (మాజీ) తాండ్ర ప్రభాకర్, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్…అనంతరం ఆలయ కమిటీ వారికి బత్తుల అంజి రూ.20000 తాండ్ర ప్రభాకర్ రూ. 5000, గాడి తిరుపతి రెడ్డి రూ. 5000
విరాళం అందచేశారు. మరియు ఇతర భక్తులు కూడా చందాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో వారిని సన్మానించారు.. అనంతరం ఆంజనేయస్వామి ప్రతిష్ట లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామి వారి విగ్రహ దాత లగడపాటి నరసింహారావుని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress Party Mandal leaders

You cannot copy content of this page

Scroll to Top