MLA Balu Naik : కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్య కర్తల సమావేశంలో పాల్గొన్న ఎంఎల్ఏ బాలు నాయక్.

TRINETHRAM NEWS

దేవరకొండ. నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన ప్రాంతంగా అభివృద్ధి చేసి, ప్రజలకు అంకితం చేసే వరకు నిద్ర పోను*

పేదల కన్నీటిని తుడిచేందుకే భూ భారతిని తీసుకోవచ్చాం.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా బీదబిడ్డలకు నాణ్యమైన విద్య అందించాలని సంకల్పం తీసుకున్నాం.ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్…

డిండి (గుండ్ల పల్లి)మే 31 త్రినేత్రం న్యూస్. డిండి మండలం చెరుకు పల్లి గేట్ వద్ద శ్రీ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన డిండి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల గ్రామాల వారిగా ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమాన అవకాశాలతో దేవరకొండను రాష్ట్రంలోనే ఒక గొప్ప ఆదర్శవంతమైన నియోజక వర్గంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దేవరకొండను ఒక అద్భుతమైన ప్రాంతంగా అభివృద్ధి చేసి, ప్రజలకు అంకితం చేసే వరకు నిద్రపోనని, అందుకు అండగా నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గత పదేళ్ల కాలంలో డిండి పూర్తిగా కుంటుపడిందని చెబుతూ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదుల రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్ కి నీటిని తీసుకోవడం కోసం ప్రభుత్వం నుంచి 1800 కోట్ల రూపాయలు మంజూరు చేయించి,టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని,త్వరంలో పనులు ప్రారంభిస్తునట్లు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, దేవరకొండ నియోజక వర్గానికి అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు,ఆ తర్వాత అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకుని పనిచేస్తామని, అభివృద్ధి రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలోఎన్నిసార్లయినా ముఖ్య మంత్రి ని కలుస్తానని పునరుద్ఘాటించారు.ప్రభుత్వం రైతు, మహిళాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని,రుణ విముక్తులను చేయడానికి రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సహాయం కింద రైతు భరోసాను 10 నుంచి 12 వేలకు పెంపు మద్దతు ధరతో పాటు ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లింపు, భూమిలేని వ్యవసాయ నిరుపేదలకు 12 వేల చొప్పున సహాయం అందిస్తున్న విషయాలను శాసనసభ్యులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,జిల్లా నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, ఎన్ యస్ యు ఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Balu Naik, who

You cannot copy content of this page

Scroll to Top