రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, తాజా మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, డివిజన్ సోషల్ మీడియా టీం సభ్యులు పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అధ్యక్షుడు బొంతల రాజేష్
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శ్రమ ఫలితంగా అంతర్గాం, పాలకుర్తి మండలాల రైతులకు జీవితంలో మార్పు తీసుకురానున్న రెండు మహత్తర ప్రాజెక్టులు బండల వాగు ప్రాజెక్ట్ మరియు ముర్ముర్ ఎత్తిపోతల పథకం ప్రారంభంతో ఈ ప్రాజెక్టుల ద్వారా వేల ఎకరాల పొలాలకు సాగునీరు అందనుండటంతో రైతులు నీటి కోసం తలమునకలు పడే రోజులు ఇక ముగియనున్నాయి అని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈనెల 3వ తేదీన ఉదయం 10 గంటలకు అంతర్గాం మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో వారికి ఘనంగా స్వాగతం పలకడమే కాక, రామగుండం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసేలా భారీ స్థాయిలో నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కార్పొరేషన్ పరిధిలోని ప్రతీ డివిజన్ నాయకులకు, సీనియర్ కార్యకర్తలకు, మాజీ కార్పొరేటర్లకు గ్రామ ఇంచార్జిలుగా బాధ్యతలు అప్పగించారు ఈ రెండు ప్రాజెక్టులు బండలవాగు, ముర్ముర్ రాయితీ పై నీటి పంపకాలు, పంటలకు నిరంతర సాగునీటి సరఫరా, భూగర్భ జలాల రీచార్జ్ వంటి ప్రయోజనాల ద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయనున్నాయి.
బొంతల రాజేష్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించి, రైతుల అభివృద్ధికి పాలకులుగా నిలవాలి. ఈ కార్యక్రమం కేవలం ఓ ప్రారంభోత్సవం మాత్రమే కాదు ఇది రైతుల ఆశల ఆరంభం” అని పేర్కొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


