అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సంఘ సేవకులు గాదె సుధాకర్ అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో ఊరిని కాచే పోచమ్మ తల్లి దేవాలయ ఆవరణ ఎలాంటి నీడ లేకపోవడాన్ని గమనించి అమ్మవారి ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే గ్రామ ప్రజలకు భక్తులకు ఇబ్బంది కలగవద్దు అనే ఉద్దేశంతో వారికి సౌకర్యవంతంగా ఉండాలనే మంచి సంకల్పంతో 22 వేల రూపాయలతో రేకుల షెడ్డు నిర్మించి గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకొని గ్రామ ప్రజల పట్ల ఉన్న సేవా దృక్పథం తో పాటు అమ్మవారి పట్ల భక్తి భావాన్ని చాటుకున్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన గాదె సుధాకర్ గ్రామ ప్రజలతోపాటు ప్రముఖ నాయకులు తదితరులంతా అభినందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


