గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 37 వ డివిజన్ లో శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో అనగా రోజున యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాహ్మకంగా చేపట్టిన కార్యక్రమలో భాగంగా అర్హులకు సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన ఆహార ధాన్యాన్ని అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ పథకం రూపొందించబడింది. రామగుండం ప్రజల సంక్షేమమే మా ప్రాధాన్యత. ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా మేలు జరగాలని కోరారు
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో విశ్వాసం పెరిగిందని, ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలు నిజంగా వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని స్ధానికులు అభిప్రాయపడ్డారు అనంతరం నాయకులందరూ స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి , కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ , మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి , పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, తాజా మాజీ కార్పొరేటర్లు కొలిపాక సుజాత, కొమ్ము వేణు సీనియర్ నాయకులు నాయిని ఓదెలు , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నజీముద్దీన్, నసుయ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేంటం ఉదయ్ రాజ్ , లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , సీనియర్ నాయకులు బూర్ల శ్రీనివాస్, బొంతల లచ్చన, అబ్బు , బిల్ల కొమురన్న, పబ్బతి లక్ష్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


