Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో కురిడి గ్రామానికి అభివృద్ధి జల్లు

TRINETHRAM NEWS

గిరిజనుల సమస్యలపై చురుకైన స్పందన

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు, నియోజకవర్గ (డుంబ్రిగూడ) ఏప్రిల్ 9 : అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం లోని కురిడి గ్రామం మంగళవారం నాడు ఒక ప్రత్యేక సందర్భానికి వేదికైంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కురిడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఉన్న ప్రాచీన శివాలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించిన అనంతరం, గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలో,పాల్గొన్నారుఈ సందర్భంలో గ్రామ ప్రజలతో నేరుగా ముఖాముఖి మాట్లాడిన పవన్ కళ్యాణ్, గిరిజనుల సమస్యలు శ్రద్ధగా విన్నారు.

ప్రభుత్వాల మార్పులతో తమ పరిస్థితులు మారలేదని గిరిజనులు ఆవేదనం వ్యక్తం చేశారు, ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు అందని కుటుంబాలు ఉన్నాయని తమకు న్యాయం కావాలని కోరారు, ప్రభుత్వం అందించాల్సిన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, తమకు చేరలేదని, గిరిజనులు తెలిపారు. విద్య, ఆరోగ్యం, రహదారి, తాగునీరు వంటి ప్రధాన అవసరాలపై ప్రజలు వినిపించిన మాటలపై తక్షణమే స్పందించారు.కురిడి గ్రామస్థులు తమ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోవాలని కోరగా, పవన్ కళ్యాణ్ వెంటనే సానుకూలంగా స్పందించారు. “దత్తత తీసుకున్న గ్రామం కన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తాను” అంటూ గ్రామాభివృద్ధికి తన సొంత నిధుల నుంచి రూ. 5 లక్షలు ప్రకటించారు.
అలానే, అరకు ప్రాంతాన్ని కేరళ తరహాలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. “గిరిజన దేవతల పండుగలు, సంస్కృతిని పర్యాటకంతో అనుసంధానించి ఆదాయ మార్గాల్ని అందిస్తాం” అని తెలిపారు. ఇంకా, సికిల్ సెల్ అనీమియా వ్యాధితో బాధపడుతున్న గిరిజనులకు అన్ని విధాలుగా అండగా నిలబడతామన్నారు. వాలంటీర్ల సమస్యల విషయాన్ని కూడా రాష్ట్ర క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను వినడమే కాదు, తక్షణ నిర్ణయాలు తీసుకుని భరోసా ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ గ్రామస్తుల మనసులను గెలిచారు.
ఈ పర్యటనతో కురిడి గ్రామానికి కొత్త ఆశలు, అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రారంభమయ్యాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటన చివరలో సుంకరమెట్ట కాఫీ ప్లాంట్ లో నిర్మించిన వుడెన్ బ్రిడ్జిని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అరకు టూరిజం అభివృద్ధిలో దేశంలో ముందుంటుంది ఇది కేవలం ప్రకృతి అందాల ప్రాంతం కాదు, ఆర్థిక సాంస్కృతిక పునర్జీవనానికి కేంద్రంగా మారుతుంది, అని పవన్ కళ్యాణ్,అభిప్రాయపడ్డారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy CM Pawan Kalyan's

You cannot copy content of this page

Scroll to Top