వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : టిపిసిసి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో 5, 6, 7 తేదీలలో జరగనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనడానికి వికారాబాద్ జిల్లా నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు ద్వారా బయలుదేరారు.
ఈ సందర్భంలో పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి నాయకులు, కార్యకర్తల అవసరాలను స్వయంగా పరిశీలించి,వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక రైలులో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు .ప్రతి ఒక్కరిని గుర్తించి, వారి రవాణా, భద్రతా ఏర్పాట్లు చూసుకుంటూ ఢిల్లీకి విజయవంతంగా తరలించారు.వెంట రంగారెడ్డి జిల్లా డి.సి.సి.అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి , మేడ్చల్ జిల్లా డి.సి.సి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


