Dr. Methuku Anand : వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశాల మేరకు

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు K. గోపాల్ ముదిరాజ్ అధ్యక్షతన.. ఈరోజు వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని బి ఆర్ ఎస్ భవన్ ( జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం)లో వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని 32 వ వార్డు కు సంబందించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో భాగంగా వికారాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు K. గోపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ 32 వ వార్డులోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు & కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మరియు రాబోయే మున్సిపల్ ఎన్నికలకు BRS పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా సిద్ధంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ అనంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, వికారాబాద్ పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు సుభాన్ రెడ్డి, పట్టణ జనరల్ సెక్రెటరీ గాండ్ల మల్లికార్జున్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ormer MLA Dr. Methu Anand...

You cannot copy content of this page

Scroll to Top