వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : నిన్న మహా టీవీ కార్యాలయంపై జరిగిన సంఘటనను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదు. సమాజంలో జరుగుతున్న మంచి, చెడులను విశ్లేషించి ప్రజలకు సమాచారం అందించడం జర్నలిస్టుల ప్రధాన బాధ్యత.జర్నలిస్టు వృత్తిని నిబద్ధతతో నిర్వహిస్తూ సమాజంలో మంచి, చెడును బహిర్గతం చేస్తున్న నిజమైన జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు.
వారిపై ఎవరు దాడులు, బెదిరింపులకు గురిచేయరు.కొన్ని సంస్థలు, వ్యక్తులు జర్నలిజాన్ని బ్రష్టు పట్టించే చర్యలకు పాల్పడుతూ, సమాజాన్ని చెడు వైపు నడిపిస్తున్నారు, జర్నలిస్టుల విలువలను దిగజార్చుతున్నారు. ఇది సమాజానికి, పత్రిక, మీడియా స్వేచ్ఛకు మంచిది కాదు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉన్నత స్థాయి వ్యక్తులను టార్గెట్ చేసుకుంటున్నారు తమ పైత్యాన్ని , ఉగ్రవాదాన్ని ప్రదర్శించిన మీడియా సంస్థలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఫోన్ టాపింగ్ వ్యవహారం రాష్ట్ర అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయం.
దీనిపై విచారించేందుకు హైకోర్టు* ఉంది, ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయబడింది. ఏమైనా విషయాలు ఉంటే వాళ్లు బయట పెట్టాలే తప్ప ఆధారాలు లేకుండా ఎవరో చెప్పారని ఇష్టం వచ్చినట్టు రాస్తే ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా ఊరుకోరు. గత కొంతకాలంగా కొన్ని మీడియా సంస్థలు కేసీఆర్ మరియు కేటీఆర్* కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకొని జుగుప్సాకరమైన శీర్షికలతో రాతలు రాసి ప్రచురిస్తూ ఉండటం ఏమాత్రం మంచిది కాదు. వారికి కూడా కుటుంబాలు ఉంటాయి అని ఆలోచించాలి. ఇటువంటి ఎల్లో జర్నలిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి ఉండదు.
మీకు నచ్చితే రాముడుగా చిత్రీకరించడం. లేకుంటే రాక్షసుడిగా చిత్రీకరించడం సరి కాదు.ఇలా నిత్యం మీ అక్షరం అమ్ముకుంటూ. దానికి జర్నలిజం అని ముసుగు తొడగడం అవసరమా.ఇలా తప్పుడు వార్తలు రాసిన, ప్రచారం చేసిన. తొక్కి నార తీసి. తోకలు కత్తిరించి .తోలు తీస్తారు నేటి జనం! తస్మాత్ జాగ్రత్త.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


