ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Birthday Celebrations

ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

Birthday Celebrations : దేవరకొండ డివిజన్ జులై 18, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని వృద్ధాశ్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ…మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడని కొనియాడారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సమాజంలో వృద్ధుల పట్ల గౌరవం, సేవాభావం ప్రతి ఒక్కరిలో ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరో ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page