Flyover Steps Collapse : కుప్పకూలిన ఫతేనగర్ రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ స్టెప్స్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 27 : కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఫ్లైఓవర్ స్టెప్స్ సోమవారం సాయంత్రం ఒకసారిగా కుప్ప కూలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనా స్థలాన్ని కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్ మంగళవారం ఉదయం పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఈ విషయమై మాట్లాడారు. బాధితులకు చికిత్స కోసం తగిన సహాయం వెంటనే అందించవలసిందిగా సూచించారు.

ఈ వంతెన నాణ్యత మరియు మెట్ల పునర్నిర్మాణం పైన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈ బ్రిడ్జి పనులు చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సూరజ్ తివారి, నాగిరెడ్డి, పుష్ప రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కుక్కల రమేష్, యూసఫ్ , బాకీ, అరుణ్, కిట్టు, హమీద్, ఎజాజ్, శ్రీను ,రాజ పటేల్, చంద్రశేఖర్ ,మధు, రమణ, భరత్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fatehnagar Railway Station Flyover

You cannot copy content of this page

Scroll to Top