జూన్ 26, 2026
TRINETHRAM NEWS
joining of Janasena Party
  • 14 మంది సభ్యులతో ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఏర్పాటు
  • ⁠త్వరలో తెలంగాణ కమిటీ

Janasena : త్రినేత్రం న్యూస్ : జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని నియమించాము. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారి చేరికలను సమన్వయం చేస్తుంది.
ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్, డా.పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టి సి వరుణ్, ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేస్తాను. ఆంధ్ర ప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నాము.

(పవన్ కళ్యాణ్)
అధ్యక్షులు, జనసేన

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page