TRINETHRAM NEWS

గోకవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల కోసం గోకవరం మండలం పరిధిలో బుధవారం అధికారులతో కలిసి పర్యటించి కృష్ణుడుపాలెం కాలనీ వాసుల సమస్యలు తెలుసుకోవడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.

దేవీపట్నం మండలం పరిధిలో 18 గ్రామాలకి చెందిన కుటుంబాలకు కృష్ణుడుపాలెం గ్రామంలో పోలవరం పునరావాసం కోసం సేకరించిన సుమారు వంద ఎకరాల స్థలంలో సుమారు 1160 కుటుంబాలు 5000 వేల జనాభా కు పునరావాస కాలనీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సదరు కుటుంబాలు దేవీపట్నం మండలం పరిధిలో చెందిన దృష్ట్యా వారికి రేషన్ పంపిణీ, ఉపాధి హామీ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు ఇబ్బందులు, కాలనీలో పారిశుధ్యం నిర్వహణ పై సమస్యలు పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో పర్యటించి కాలనీ వాసులతో మాట్లాడడం జరిగిందన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డులు గోకవరం మండలం కు మార్పు చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇక్కడ ఈ కాలనీ లో సుమారు 5000 వేల మందికి పైగా జనాభా ఉన్నట్లు దేవీపట్నం, గోకవరం మండల అధికారుల సమక్షంలో, మీరందరు గ్రామ సభ నిర్వహించుకుని, ఒక ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం చేసుకోవాల్సి ఉంటుందని తెలియ చేశారు. ఆ తీర్మానం ను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చెయ్యడం ద్వారా, ఇక్కడ ఒక సచివాలయం, రేషన్ షాప్, ఇతర పరిపాలన పరమైన వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం సాధ్యం అవుతుందని కాలనీ వాసులకు వివరించడం జరిగింది. అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా వివిధ గ్రాంట్లు, నిధులు సమకూర్చుకునే వెసులుబాటు , గ్రామాభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. కృష్ణుడుపాలెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శానిటేషన్ నిర్వహణ విషయంలో ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. స్థానిక శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ ఇక్కడి కాలనీ వాసుల సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారని, ఆ దిశలో ఇక్కడికి రావడం జరిగిందన్నారు.

కృషుడు పాలెం కాలనీ వాసులు గ్రామ సభ నిర్వహించుకుని ఈ కాలనీకి ప్రత్యేక పంచాయతీ పేరును సూచిస్తూ తీర్మానం అనుసరించి తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.

కలెక్టర్ వెంట జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతా మణి, డ్వామా పిడి ఏ. నాగ మహేశ్వర రావు, గోకవరం తహసిల్దార్ ఎమ్ వి సాయి ప్రసాద్, ఎంపిడివో ఎమ్. గోవింద్, దేవీపట్నం తహసిల్దార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collector visits Krishnadupalem colony