MLA Vegulla : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్, డిసెంబర్ 3 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రైతులను ఆదుకునేలా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ రైతులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. మండపేట పట్టణంలో ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న 5 సంవత్సరాలలో రైతును రాజును చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యచరణ చేపట్టిందన్నారు. మండపేట నియోజకవర్గంలో గత వారంరోజుల నుండి రైతన్న మీకోసం కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు ప్రతీ రైతు ఇంటికి వెళ్ళి రైతులకు అందిస్తున్న సంక్షేమ పధకాలను వివరించటమే కాకుండా వారి నుండి మంచి చెడ్డలు తెలుసుకోవటం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందించే దిశగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం అన్నారు.

సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులు మార్చుకోవాలన్నారు. సాగుకు టెక్నాలజీ తోడైతే రైతులకు తిరుగుండదన్నారు. అందుకే అగ్రిటెక్ ను ప్రోత్సహిస్తున్నారన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ ల సేద్యాన్ని విస్తరించి, నీటి వినియోగ సామర్థ్యాన్ని 40-50% వరకు పెంచి రైతు ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం పై గత ప్రభుత్వం రద్దు చేసిన 100 శాతం సబ్సిడీని ఈ ప్రభుత్వం పునరుద్ధరించిందన్నారు. అలాగే ప్రకాశం, రాయలసీమ జిల్లాల మధ్యతరగతి (10 ఎకరాల లోపు) రైతులకు గత ప్రభుత్వం సబ్సిడీని తగ్గించగా దాన్ని ఈ ప్రభుత్వం 90 శాతానికి పెంచిందన్నారు. యంత్రాలు, టెక్నాలజీ వాడుకతో వ్యవసాయంలో పెట్టుబడి తగ్గుతుందన్నారు.

రైతుల పంటలకు విలువ పెరగాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలని దీని కోసం రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో 38 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సీఐఐ సదస్సులో ఎంఓయూలు కుదుర్చుకున్నారన్నారు. మండపేట నియోజకవర్గం నకు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ – పి.యం.కిసాన్ పథకం కింద రెండు విడతల్లో ఒక్కొక్కరికి రూ.14 వేల చొప్పున 17 వేల 380 మంది రైతు కుటుంబాలకు మొత్తం రూ.24.91 కోట్లు ఇచ్చాం అన్నారు. కొత్త ఆలోచనలు పంచుకుంటూ మార్పుకు నాంది పలకడానికి కూటమి ప్రభుత్వానికి అన్నదాతలు అందరూ తోడ్పాటును ఇవ్వాలని ఎమ్మెల్యే వేగుళ్ళ కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటి అధ్యక్షులు కుక్కల రామారావు, డైరెక్టర్ పడాల జన్నయ్య, సిద్దిరెడి రామన్న, అధికారులు ఎ.డి చౌదరి, ఎ.ఒ కె.ప్రభాకర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Coalition government supports farmers

You cannot copy content of this page

Scroll to Top