జూలై 14, 2026
TRINETHRAM NEWS
CM Revanth Rythu Ashirvada Sabha

CM Revanth : త్రినేత్రం న్యూస్ : ఖమ్మం, జూలై 7 : గత నెల 30న వర్షం కారణంగా వాయిదా పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభను ఈ నెల 9వ తేదీన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరగనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.

సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం పరిశీలించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సభ విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించిన అనంతరం ఈ నెల 9న రైతు ఆశీర్వాద సభ నిర్వహణపై అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page