‘CM Cup’ Games : ‘సీఎం కప్’ క్రీడల ప్రారంభం

TRINETHRAM NEWS

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లోదాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.

-మండల విద్యాధికారి:- ఇస్లావత్ గోప్యానాయక్.

డిండి (గుండ్ల పల్లి) జనవరి 22 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా గురువారం చెరుకుపల్లి క్లస్టర్ స్థాయి పోటీలు పాఠశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ పోటీలను స్థానిక సర్పంచ్ మీసాల రామచంద్రయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్ననైపుణ్యాన్నివెలికితీయడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఇస్లావత్ గోప్యా నాయక్, పంచాయతీ సెక్రటరీ, పాఠశాలప్రధానోపాధ్యాయులుఉపాధ్యాయ బృందం, వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు మరియు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడా మైదానం విద్యార్థుల కేరింతలు, పోటీల ఉత్సాహంతో సందడిగా మారింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

‘CM Cup’ Games begin

You cannot copy content of this page

Scroll to Top