దేవరకొండ డివిజన్ జనవరి 22 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించివారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా డాక్టర్లు సిబ్బంది చూసుకోవాలని ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలను అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించి వైద్యులు సమయపాలన పాటించాలని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


