CM Chandrababu Naidu : ఎమ్మిగనూరులో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

TRINETHRAM NEWS

మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

Trinethram News : అమరావతి, ఫిబ్రవరి 5 :- కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించనున్నారు. కలుగట్లలో జరిగే మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొంటారు.

శుక్రవారం ఉదయం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు కలుగట్ల చేరుకుంటారు. గ్రామసభలో పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం, ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో ముఖాముఖి చర్చిస్తారు. చివరిగా కలుగట్లలో జరిగే పార్టీ క్యాడర్ మీటింగ్‌కు హాజరవుతారు.

సాయంత్రం 5.30 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున రాష్ట్రంలో మొత్తం 279 గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం 1,16,870 డ్రాఫ్ట్ పాస్‌ బుక్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 91,038 డ్రాఫ్ట్ పాస్‌ బుక్స్ eKYC కూడా పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలోని 13 గ్రామాల్లో 8,347 మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. అయితే, కలుగట్ల గ్రామంలో 1,178 మంది రై

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Chandrababu Naidu to visit Emmiganur tomorrow

You cannot copy content of this page

Scroll to Top