త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మండపేట. సంక్షేమ పాలన అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరారావు, పేర్కొన్నారు. బుధవారం మండపేట పట్టణంలో 15వ వార్డు నందు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా స్థానిక కూటమి నాయకులు ఎమ్మెల్యే వేగుళ్ళకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గురించి ప్రజలకు వివరించారు.
అలాగే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రోడ్లు, కాలువలు, తాగునీటి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని తెలిపారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


