ఆగస్ట్ 15, 2026

WhatsApp Image 2023 12 10 at 2.52.56 PM

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 10
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.

కార్తీక మాసం చివరి రోజుకావడంతో భక్తులు భారీగా పోటెత్తారు. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరి సిపోయాయి. భక్తులు స్వామివారిని దర్శించు కోవడానికి మూడు గంటల సమయం పడుతోంది.

భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు నోమాలు వ్రతాలు చేసి భక్తపారవశ్యంలో మునిగి పోయారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కావడంతో విశేష పూజలు అందు కుంటున్నారు.

అర్చకులు స్వయం భువులగా కొలిచి కవచ మూర్తులకు అష్టోతర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ కల్యాణ మండపంలో 108 కలశాలకు పూజలు చేపట్టారు.

మహిళలకు ఉచితం ప్రయాణం కావడంతో భారీ సంఖ్యలో మహిళలు యాదాద్రికి తరలి వచ్చారు…

You cannot copy content of this page