మెండె శ్రీనివాస్ ఆర్జీవన్ కార్యదర్శి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీడీకే -2 ఇంక్లైన్ లో జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మె జయప్రదం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేకమైన లేబర్ కోడ్స్ వల్ల జరిగే నష్టాలను తెలిపే సిఐటియు ముద్రించిన బుక్ లెట్ ను ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడుదారులకు బానిసలుగా పని చేసేందుకు కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు అనుకూలమైన 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చిందని ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు జరిగే నష్టాలు, కష్టాలను పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన బుక్లెట్ ను కార్మికులందరికీ అందజేయడం జరుగుతుందన్నారు,
కార్మికులందరికి కార్మిక చట్టాలపై అవగాహన కల్పించడమే సిఐటియు లక్ష్యం అన్నారు, ఈ బుక్లెట్ చదివితే ఏ చట్టాలు ఏ కోడ్ లో కలిపారు కార్మికులకు జరుగుతున్న నష్టం ఏంటి పెట్టుబడుదారులకు అనుకూలమైన విధానాలు ఏ రకంగా తీసుకొస్తున్నారనేది తెలియజేస్తుందన్నారు, ఈ దేశంలోని కార్మిక కర్షక వర్గంపై మోడీ ప్రభుత్వం చేస్తున్న దాడి పెట్టుబడుదారులకు అనుకూలంగా ఉందన్నారు అందుకే ఈ దేశంలోని కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అన్నీ కలిసి ఐక్యతతో 2025 జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించి ప్రభుత్వ రంగ సంస్థలు సింగరేణి బొగ్గు పరిశ్రమను రక్షించుకోవాలని, కార్మికులకు అనుకూలమైన 29 కార్మిక చట్టాలను కాపాడుకోవాలని, ఐక్యతతో ఏకకంఠంతో ఈ ప్రభుత్వంపై సమ్మెతో తిరగబడాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, పుప్పాల శ్రీనివాసరావు, వంగల రాములు, అనబోయిన శంకరన్న, పెండ్యం సమ్మయ్య, తిప్పారపు రాజు, కృష్ణ, కుమార్, జనార్దన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సందీప్, కొమురయ్య, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


