CMRF : ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఇటీవల ప్రైవేట్ హాస్పటల్స్ నందు వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కొరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 28 మందికి రూ.20,36,260/-లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాగా సదరు చెక్కులను బుధవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, చేతులమీదిగా బాధిత కుటుంబాలకు అందజేశారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందన్నారు. లబ్దిదారులు మాట్లాడుతూ కష్టకాలంలో సహాయం అందించి తమను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister's Relief Fund

You cannot copy content of this page

Scroll to Top