Trinethram News : హైడ్రాకు సమకూర్చిన యంత్రాలు, వాహనాలను సైతం సీఎం ప్రారంభించారు. హైడ్రా అనేది ప్రత్యేక వ్యవస్థగా అవతరించిందని, హైడ్రాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అధికారాలు ఇచ్చారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అనేక అధికారాలు ఒక దగ్గర కేంద్రీకరించడం వల్ల హైడ్రా పని సులభమవుతుందని , బుల్కాపూర్ నాలాకు సంబంధించిన సమస్యను ప్రత్యేక అధికారాలతో హైడ్రా ఒక రోజులోనే పరిష్కరించిందని గుర్తు చేశారు. దుండిగల్లో రెండు చెరువుల మధ్య ఉన్న నాలా సమస్యను పరిష్కరించి అక్కడి ప్రజలకు ఊరట కల్పించామని సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం ఆశయాలకు అనుగుణంగా హైడ్రా శరవేగంగా పని చేస్తుందని వెల్లడించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూముల రక్షణలోనే కాదు విపత్తుల నిర్వహణలోనూ హైడ్రా విశేషంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. డీఆర్ఎఫ్లోకి ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగాలకు స్వల్ప మార్కులతో కోల్పోయిన వారిని తీసుకున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ రావడం హైడ్రాను మరింత బలోపేతం చేస్తుందని, ఆక్రమణ వెనుకున్న సుత్రధారుల పాత్ర కూడా బయటపడుతుందని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


