ఓట్ల కోసం వంచన, గద్దెపైకి వచ్చాక గుండెల మీద బుల్డోజర్

TRINETHRAM NEWS
  • దోమాడ లో చట్టానికి సెలవు.
  • కాసుల కోసం పేదల ఆశ్రయాలపై పంజా విసిరిన రాక్షస పాలకుడు.
  • రామకృష్ణారెడ్డి కాదు… రాక్షసకృష్ణారెడ్డి.
  • దోమాడ లో పేదల ఇళ్ల మీద పడ్డది బుల్డోజర్ కాదు – అది వారి ఆశలపై పడిన గుదిబండ.
  • ప్రజలు విలపిస్తుంటే… కూటమి నాయకులు మౌనంలో గల్లంతయ్యారా?
  • లేఔట్ యజమానికి చిన్న ఇబ్బంది ఉన్న వెంటనే స్పందన! కానీ ప్రజల కన్నీళ్ళకు విలువే లేదు.
  • నాయకులను ఎన్నుకోలేదు, మాయగాళ్ళను ఎంచుకున్నాం.
  • ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం హేయమైన చర్య.

Trinethram News : పెదపూడి : అనపర్తి చరిత్రలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నా, కాసుల కక్కుర్తి కోసం ఆశ్రయాలే జీవితం అయిన పేదల ఇళ్లు కూల్చివేయించిన నీచుడిగా రామకృష్ణారెడ్డి చరిత్రలో నిలిచిపోతారని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇక్కడ పాలన లేదు… హిట్లర్ పాలనా శైలి ఉంది! ఇక్కడ సహాయం లేదు… కమీషన్ల కోసం లెవల్‌ ప్లానింగ్ ఉంది! ఇక్కడ అభివృద్ధి లేదు… పేదల కన్నీళ్ల మీద కూటమి గూండాల పరాకాష్ట ఉంది! ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే జీవితమే కదా… ఆ జీవితాన్ని నేలమట్టం చేయించిన రాక్షసకృష్ణారెడ్డి కి మా గోడు ఏమి తెలుస్తుంది అని స్థానికులు అన్నారు.

అనపర్తి శాసనసభ్యుడు కమీషన్లకు విలువ ఇచ్చే పాలకుడు.

అతని చరిత్రలో పాలన లేదు.. పగ ఉంది.
అతని డైరీలో ప్రణాళికలు లేవు… పేదల ఇళ్ల జాబితా ఉంది..!!

రామకృష్ణారెడ్డి పేరు ఇప్పుడు ఇంట్లో శాపంగా పలుకుతున్నారు.

అతనికి ఓటేసిన నా చేతులు కోసుకోవాలనిపిస్తోంది అని అక్కడ ఉన్న మహిళ చెప్పింది.

ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తమ ఇంటి పన్నులు, ఇతర అన్ని పన్నులను ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చెల్లిస్తున్నారు.లేఅవుట్ యజమాని వద్ద నుండి వచ్చే కమీషన్ కోసం, అనపర్తి ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం, ముందుగా నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చివేశారు.

మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు, పెదపూడి మండల వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు వెంటనే స్పందించిన తీరు మా మనసుల్ని తాకింది. ఆయన వలనే ఈ విషయం రాష్ట్రం నలుమూలలకూ వెళ్లిందని ప్రజలు అన్నారు. అయితే ఇదే సమయంలో కూటమి నేతలు మాత్రం మౌనంగా, దూరంగా, కనపడకుండా ఉన్నారు.

ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు: ఓట్ల కోసం మా ఇంటి ముందుకు వచ్చారు… ఇప్పుడు మా నడ్డి విరిగిపోతుంటే ఒక్కసారి కూడా చూద్దామని రాలేదు? గెలిచాకే మమ్మల్ని మరిచిపోయారా?”

వాళ్లకి ఓటేసి మా జీవితాలని చెలగాటంతో ఆడించాం… మేము నాయకులను ఎన్నుకోలేదు, మాయల గాళ్లను ఎంచుకున్నాం! అని ప్రజలు పేర్కొన్నారు.

ఈ ఘటనలో ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అండగా నిలుస్తామని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గారు హామీ ఇచ్చారు.

కష్టకాలంలో మాకు అండగా నిలబడిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారికి, పెదపూడి మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ మేమందరం జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cheating for votes, bulldozing

You cannot copy content of this page

Scroll to Top