MLA Gorantla : గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుంది

TRINETHRAM NEWS

ప్రతి గ్రామానికి అభివృద్ధి పండుగ తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం…

6.41కోట్ల రూపాయలతో హుకుంపేట, బొమ్మూరు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే గోరంట్ల

Trinethram News : గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుందని, ఎన్నడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. హుకుంపేట పంచాయితీ శాంతిపురం నందు 85 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, చైతన్య నగర్ నందు 60 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, నాగిరెడ్డి నగర్ నందు 9 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, రామకృష్ణ నగర్ నందు 35 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, రామకృష్ణ నగర్, వరలక్ష్మి కాలనీ నందు 1కోటి 39.50 లక్షల రూపాయలతో రెండు వాటర్ ట్యాంకులు మరియు డి.బ్లాక్ నందు 35 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, 20.80 లక్షల రూపాయలతో వెల్నెస్ సెంటర్, 96 లక్షల రూపాయలతో మెయిన్ రోడ్ సీ.సీ డ్రైన్ అలాగే బొమ్మూరు గ్రామంలో మురళి కొండ నందు 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, వీరభద్ర నగర్ నందు 23 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, జిఆర్పి రోడ్డు 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, వెంకటగిరి కొండ నందు 5 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, నాయుడుపేట నందు 7 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, జె.ఎల్.బి నగర్ నందు 27 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ రెండు గ్రామాలలో మొత్తం కలిపి 6.41 కోట్ల రూపాయలతో పూర్తిచేసిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్, ఏ.ఎం.సి చైర్మన్ మార్ని వాసుదేవ్ లతో కలిసి ప్రారంభించారు.

ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామానికి అభివృద్ధి పండుగ తీసుకువచ్చిందని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనేక పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని అన్నారు. హుకుంపేట, బొమ్మూరు గ్రామాలలో 6.41 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని నగరానికి అతి చేరువలో ఉన్న శాంతిపురం నందు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన ప్రజలు ఇక్కట్లు పడేవారని ఒక ప్రత్యేక కార్యాచరణతో రోడ్లు వీధిలైట్లు ఏర్పాటు చేశామని త్వరలో డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఇంత వేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి కారణమైన అధికారులకు అభినందనలు తెలపాలని ఇంజనీరింగ్ రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలవారు సంయుక్తంగా కార్యాచరణ చేయడం వలన ఇంత తొందరగా పనులు పూర్తవుతున్నాయని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గోదావరి నది మనందరికీ చేరువుగా ఉన్నప్పటికీ కూడా కొన్నిచోట్ల త్రాగునీటి కొరత ఉందని జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి గోదావరి నీటిని అందించే విధంగా కార్యాచరణ చేస్తున్నామని అన్నారు.

డి.బ్లాక్ నందు ప్రధాన సమస్య మెయిన్ డ్రైనేజీ నిర్మాణమని ప్రజల సహకారంతో ఆక్రమణలు తొలగించి 96 లక్షల రూపాయలతో మెయిన్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసామని మరో 20 లక్షల రూపాయలతో కొంతమేర మిగిలి ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే మీ అందరికీ చేరువుగా ఉండే విధంగా ఇక్కడ వెల్నెస్ సెంటర్ ప్రారంభించామని ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఈ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డి.బ్లాక్ నందు టవర్ లైన్ కింద వారికి మరియు ఒడియా పేట వారికి ఇళ్ల స్థలాల విషయంలో గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఇక్కడ జీవన ఉపాధి చేసుకుంటూ నివసించే వారికి 30 కిలోమీటర్ల దూరంలో పట్టాలు కేటాయించిందని రాబోయే రోజుల్లో డి.బ్లాక్ లోనే టిట్కో ఇల్లు నిర్మాణం చేసి వారికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే బొమ్మూరు గ్రామంలో 1కోటి 25 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేశామని దీర్ఘకాలంగా ఉన్న అనేక సమస్యలను గుర్తించి 3.45 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేశామని ప్రజల అభీష్టం మేరకు విడతల వారీగా పనులు చేసుకుంటూ ముందుకెళతామని ఈ ప్రాంతంలో కొంత మంచినీటి సమస్య ఉందని త్వరలోనే సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి గోదావరి నీటిని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి ఎం.జ్యోతి, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, కురుకూరు కిషోర్, పెండ్యాల రామకృష్ణ, బేమరిశెట్టి రమేష్, పిల్ల తనుజ, మండ బిందు, యలమాటి రామకృష్ణ, అల్లూరి నరసింహారావు, నడిగట్ల కామేష్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్ బాబు, ఏ.ఈ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Development festival to be

You cannot copy content of this page

Scroll to Top