MLA Vegulla : రాష్ట్ర ప్రజలకోసం అనుక్షణం పరితపిస్తున్న నేత చంద్రబాబు

TRINETHRAM NEWS

వేగుళ్ళ లాంటి వ్యక్తిని ఎమ్మెల్యే గా పొందడం మండపేట నియోజకవర్గ ప్రజల అదృష్టం…

వేగుళ్ళ పని రాక్షసుడు…

నిత్యం నియోజవర్గ అభివృద్ధి కోసమే శ్రమిస్తారు…

చెల్లూరు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్…

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట, ఒక కుటుంబం బాగుండాలని ఓ తల్లి ఎలా ఆరాటపడుతుందో ఈ రాష్ట్రం బాగుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా ఆరాటపడి పనిచేస్తున్నారని, అటువంటి నాయకుడి నాయకత్వంలో పని చేయడం తాము చేసుకున్న పూర్వ జన్మ సుకృతమని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయవరం మండలం చెల్లూరు లో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మేల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

తొలుత చెల్లూరు లో మంత్రి కేశవ్ కు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎంజిఎన్ఆర్ఇజియస్ నిధులు రూ.40.00 లక్షలతో చెల్లూరు లో నిర్మించిన సచివాలయం-3 భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జల్ జీవన్ మిషన్ (జెజెఎం) నిధులు రూ.86.40 లక్షలతో నిర్మించిన ఇంటింటికీ మంచినీటి కుళాయి పథకాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి చేతులు మీదుగా మంచి నీటి బిందెను ఓ మహిళ కు అందజేశారు. తదనంతరం ఎంజిఎన్ఆర్ఇజియస్ నిధులు రూ.90.00 లక్షలతో నిర్మించనున్న పంచాయితీ రాజ్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంఖుస్ధాపన చేశారు. అలాగే జల్ జీవన్ మిషన్ (జెజెఎం) నిధులు రూ.1.31 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులకు శంఖుస్ధాపన చేశారు. వీటితో పాటు దాన్యం కొనుగోలు కమీషన్ నిధులు రూ.69.00 లక్షలతో నిర్మించనున్న డ్వాక్రా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్ధాపన చేశారు. కార్యక్రమాల అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

తొలుత ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ గడిచిన నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిపించిన మండపేట నియోజకవర్గ ప్రజలకు జన్మ జన్మల రుణపడి ఉంటానన్నారు. ఐదేళ్లలో వైసీపీ నాయకులు అక్కడ రాష్ట్రాన్ని, ఇక్కడ మండపేట నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యాంగ మార్చేశారన్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో మరలా రాష్ట్రంలో రామ రాజ్యం మొదలైందన్నారు. గడిచిన ఏడాది కాలంలో ప్రజలకు ఏమేం చేశామో తెలియజేసేందుకు మంత్రి నారా లోకేష్ గొప్ప ఆలోచనతో సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ఇప్పటికే మండపేట నియోజవర్గంలో 97 శాతం సుపరిపాలన కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 3 శాతం పనులు కూడా కూటమి శ్రేణులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతీ ఇంటిని ఖచ్చితంగా పలకరించి వెళ్ళే విధంగా మై టీడీపీ యాప్ లో 3 నిమిషాల వ్యవధిని కేటాయిస్తూ టెక్నాలజీ ని గొప్పగా వాడుతున్నారన్నారు. లోకేష్ ఎంతో పరిణితి చెందిన ఆలోచనలతో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్నారన్నారు. ప్రతీ సంక్షేమ పథకం చిట్ట చివరి వ్యక్తి వరకు అందేవిధంగా ప్రతీ ఒక్కరూ కష్టించి పని చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అన్నింటిని విజ్ఞాపన పత్రం రూపంలో మంత్రికి అందివ్వడం జరిగిందని, వాటన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర నీటిపారుదల శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలా కృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్నింటా నిర్వీర్యం చేసిందన్నారు. అయితే ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం పట్టుదలతో పని చేసి పాలనను గాడిలోబోదుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్కడ జగన్ ప్రజా వేదిక కూలదోస్తే ఇక్కడ వైసీపీ నేత మండపేటలో వైశ్య సామాజిక వర్గీయులకు చెందిన గోడౌన్ ను కూలదోసారన్నారు. వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకు 20 గంటలు కష్టించి పని చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నారన్నారు. తాను అడిగిన వెంటనే నీటిపారుదల శాఖకు అవసరమైన 10 కోట్ల రూపాయలను విడుదల చేసిన మంత్రి కేశవ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సభాముఖంగా చెప్పారు. 30 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే పది వేల ఎకరాలకు నీరు అందించే పనులను సైతం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. తను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రైతులకు అండగా నిలిచే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

మంత్రి పయ్యావుల మాట్లాడుతూ మండపేట నియోజకవర్గ. ప్రజలు ఎంతో అదృష్టవంతులని, ఎంతో కార్యసాధకుడు, పని రాక్షసుడైన ఎమ్మెల్యే ను పొందడం వారు చేసుకున్న అదృష్టమని వేగుళ్ళ ను ఉద్దేశించి కొనియాడారు. దాదాపు 20 ఏళ్లుగా వేగుళ్ళ తనకు తెలుసునని, ఎప్పుడూ వివాదాలకు పోని గొప్ప సౌమ్యుడని కితాబిచ్చారు. అనుకున్న పని పూర్తయ్యే వరకు విసుగు లేకుండా తిరుగుతూనే వుంటారని కొనియాడారు. ఓ తల్లి తన కుటుంబం కోసం ఎలా ఆరాటపడుతుందో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే రాష్ట్రం కోసం ఆరాటపడి పని చేస్తున్నారన్నారు. ప్రతీ రూపాయి ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ప్రజలకు ఉపయుక్తమైన పాలన అందిస్తున్నారన్నారు. అందరూ జిల్లా పరిథిలో ఉచిత ఆర్టీసీ కేటాయించాలని చూస్తే ఆయన మాత్రం ఎల్లలు లేని ఉచిత ప్రయాణాన్ని మహిళలకు అందించాలని ఆలోచన చేస్తున్నారన్నారు. ఒక ఆర్థిక శాఖ మంత్రి గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొన్ని విషయాల్లో తాను వెనక్కి తగ్గినా ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి తగ్గరని, మరింత మెరుగైన పథకాలు ప్రజలకు అందించాలని చూస్తారని పేర్కొన్నారు.

భారతదేశంలో అప్పు కూడా పుట్టని దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ తయారు చేశారన్నారు. ప్రజలకు కనిపించే సమస్యలు కొన్ని అయితే కనిపించని నష్టం చాలా చేశారన్నారు. ఈ రాష్ట్ర సంపదను జగన్ దోచుకున్నాడన్నారు. కేవలం చంద్రబాబు పాలదక్షత తోనే రాష్ట్రం మరలా గాడిలో పడుతుందన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ చక్కటి సహకారం అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

ఈ దేశంలో పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసిన చరిత్ర జగన్ కే దక్కుతుందన్నారు. అన్నా క్యాంటిన్ లను అన్నం తినే వారు ఎవరూ రద్దు చేయరని, కేవలం జగన్ మాత్రమే చేశారని విమర్శించారు. కేవలం వంద రోజుల్లో హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి నీరందించిన ఘనత చంద్రబాబుదన్నారు. ఈ రోజు కోసం మనం ఆలోచిస్తే రేపటి కోసం చంద్రబాబు ఆలోచిస్తారాన్నారు. ఈ తరం చుట్టూ మన ఆలోచనలు సాగితే భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు ఆలోచన సాగిస్తారన్నారు. అలాంటి దార్శనీకుని హయాంలో తాము పని చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం మంత్రి కేశవ్ ను ఎమ్మెల్యే వేగుళ్ళ, స్థానిక కూటమి నేతలు, డ్వాక్రా మహిళలు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chandrababu Naidu, the leader

You cannot copy content of this page

Scroll to Top