త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 23, మండపేట: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, సన్మాల ధనరాజు ను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి గురువారం, పరామర్శించారు. స్థానిక 11వ వార్డులో ఉన్న వారి స్వగృహానికి వెళ్లి ఆయన ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైస్సార్సీపీ నాయకులు సాధనాల శివ భగవాన్, యరమాటి వెంకన్నబాబు, గునిపే అఖిల్, వంశి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


