Green Konaseema : పచ్చని కోనసీమ ను సర్వనాశనం చేస్తున్న కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు

TRINETHRAM NEWS

కేజీ బేసిన్ సంపదలో 50% తక్షణమే అమలు చేయాలి .

ఓ ఎన్ జి సి కేంద్ర కార్యాలయాన్ని చెన్నై నుండి రాజమండ్రి కి తరలించండి .

ఓ ఎన్ జి సి ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ యువతకు 50% రిజర్వేషన్ అమలు చేయండి ..

మేడా శ్రీనివాస్ , డిమాండ్ , రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్

త్రినేత్రం న్యూస్, ఆంధ్రప్రదేశ్ లో వంట గ్యాస్ సిలెండర్ ను 200/- రూ కే సరఫరా చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర , రాష్ట్ర ను కోరారు .

గతంలో పాశర్లపూడి బ్లో ఓట్, నగరం లో అగ్నికి ఆహుతి అయ్యి ప్రాణాలు కోల్పోయిన ఘటన , నేడు ఇరుసుమండ లో మరో బ్లో ఔట్ ఇలా పచ్చని కోనసీమ ను కేంద్ర రాష్ట్ర రాజకీయ అవసరాలకు , అవినీతి దాహానికి సర్వనాశనం చేస్తున్నారు . కోనసీమ నుండి లక్షల కోట్లు విలువ చేసే సంపదను దోచుకు పోతున్నారు .

కోనసీమ ప్రాంతం మొత్తం పర్యావరణాన్ని విష తుల్యంగా మార్చేస్తున్నారు . గాలి , నీరు కలుషితం అయ్యి ఆ ప్రాంత ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో నిత్యం బాధలు ఎదుర్కొంటున్నారు . ఇరుసుమండలో 100 అడుగుల దాటి ఎగసి పడిన అగ్ని కీలకాలను చూసి ప్రజలు భయాందోళనలతో బిడ్డలను పుచ్చుకుని పరుగులు పెట్టారు . నిజానికి తరచూ ఈ ప్రమాదాల వెనుక ఒక పెద్ద మాఫియా ప్రమేయం దాగి వుందని , అధికారులు, ప్రైవేట్ మాఫియా వ్యక్తులు కలసి దోచుకునే ప్రయత్నంలో భాగమే ఈ తరహా ప్రమాదాలకు కారణాలు కావొచ్చునని ఆయన అనుమానం వ్యక్త పరిచారు ..

12 వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కే జి బేసిన్ సంపదలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 50% వాటాను కేటాయించమని స్పష్టమైన ఆంక్షలు ఉన్నప్పటికి అనాదిగా ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతూనే
ఉండన్నారు . ఆంధ్రుల హాక్కు హాక్కు కోసం ఆంధ్రప్రదేశ్ నుండి పార్లమెంట్ లో ప్రశ్నించే దమ్మున్న పార్లమెంటేరియన్ లేకపోవటం ఆంధ్రులు దురదృష్టంగా బావిస్తున్నారు .

నాటి నుండి నేటి వరకు కోనసీమ ప్రాంతం నుండి అసెంబ్లీ , పార్లమెంట్ కు ఎంపికైన ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఈ ప్రాంత అభివృద్ధి కోసం , హక్కుల కోసం ప్రశ్నించిన నేతలు కోనసీమ నుండి లేరన్నారు . ప్రమాదం జరిగిన తదుపరి సొల్లు ప్రకటనలతో ప్రజలను మభ్య పెట్టటమే ఈ నేతల కాలక్షేప రాజకీయాలన్నారు . కే జి బేసిన్ అవినీతి లోగల అధికారులు, ప్రైవేట్ మాఫియా సైన్యం ఇక్కడ ఖనిజ ముడిసరుకులో మత్తు భాగస్వాలుగా కొనసాగుతున్నారు . కోనసీమను అగ్ని గుండంగా మార్చటమే ఈ ప్రైవేట్ మాఫియా ప్రధాన కుట్ర అని, కోనసీమ ప్రాంతానికి అత్యంత ప్రమాదం పొంచి వుందని నిపుణులు గుర్తించాలని ఆయన అన్నారు .

కోనసీమ నుండి నేటి వరకు చట్ట సభల్లో ప్రాతినిత్యం వహించిన కార్పొరేట్ వ్యాపార రాజకీయ పార్టి ల ప్రజా ప్రతినిధులు అవినీతికి బానిసలుగా మారిపోయారన్నారు . అభివృద్ధిని , ప్రజల భవిష్యత్ ను , భద్రతను గాలికి వదిలి అవినీతి మత్తులో జోగుతు దద్దమ్మలు వలే వారి ఉనికిని చాటుకుంటున్నారన్నారు . అధికార దుర్వినియోగం , నేతల అవినీతి , ప్రైవేట్ మాఫియా కే జి బేసిన్ అక్రమాలను సాశిస్తున్నాయన్నారు .

కోనసీమ భూ గర్భం నుండి బంగారం పట్టుకు పోతున్నారు . ఆ ప్రాంతానికి మాత్రం బూడిద కూడా మిగల్చటం లేదన్నారు . ప్రమాద కరమైన కాలుష్యంతో కోనసీమ ప్రజలను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని , ఆ కారణంగా మరణాలు సంబవిస్తున్నాయని ఆయన తీవ్ర ఆవేదన చెందారు .

బావుల్లో గ్యాస్ , క్రూడాయిల్ నిల్వలు వేల కోట్ల విలువైన సంపద ఉన్నప్పటికి బావులు ఖాళీ అయిపోయినట్టు అవినీతి అధికారులు తప్పడు నివేదికలు సమర్పిస్తున్నారని , నిబంధనలకు విరుద్ధంగా త్రవ్వకాలు సాగిస్తుండటమే ఈ తరహా ప్రమాదాలకు కారణమన్నారు . ప్రైవేట్ మాఫియా రెచ్చిపోతు కోనసీమ ప్రమాదాలకు కారకులవుతున్నారు .

కేజీ బేసిన్ త్రవ్వకాల కారణంగా కోనసీమ నష్టపోతుందని , నేతలు అక్రమార్జనతో వందల కోట్లు దోచుకుంటున్నారని , కేజీ బేసిన్ నుండి బారిగా సంపదను తరలించుకు పోతున్నారు. ఆ సంస్థ కార్యాలయాలు మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా చెన్నై లో పాలనా కార్యాలయం ఉండటం విడ్డురం , ప్రమాదాలు జరగకుండా నిత్యం పర్యవేక్షణ కూడా నిర్వహించకపోవటం వీరి అధికార సోమరితనానికి నిదర్శనం అని , కోనసీమ లో ప్రమాదాలు జరిగితే గుజరాత్, ఢిల్లీ ప్రాంతాల నుండి ప్రత్యేక బృందాలను రప్పిస్తుండటం అనేక అనుమానాలకు తావునిస్తుందని ఆయన సూటిగా ఆరోపణ చేసారు .

ఖలేజా సినిమాలో ఖనిజ సంపద కోసం ఒక గ్రామాన్నే ఖాళీ చేయించే కుట్ర వలే ప్రస్తుతం కోనసీమ ప్రాంతం పై జరుగుతున్నాట్టుగా కనపడుతుందన్నారు . కొన్ని కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ మాఫియా, వ్యాపార రాజకీయ శక్తులు బాగుపడటం కోసం కోనసీమ ప్రజల ప్రాణాలను బలితీసుకోవటం క్షమించారాని నేరం అన్నారు, కోనసీమ నుండి విలువైన సంపద పట్టుకుపోతున్నారు . కనీసం కోనసీమ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏ ప్రయోజనాలు లేకపోతున్నాయి .

కోనసీమ నుండి ఇప్పటి వరకు అధికారికంగా పట్టుకు పోయిన సంపద వెలకట్టలేని లెక్కకు మించిన లక్షలు కోట్లును దోచుకు పోయారన్నారు . పచ్చటి పర్యావరణం, సముద్ర జలాలు, అపార ఖనిజ వనరులు కోనసీమకు ప్రకృతి ప్రసాదించిన వరం అన్నారు . కే జి బేసిన్ నుండి పట్టుకు పోతున్న గ్యాస్ వనరులను ఇతర రాష్ట్ర రాజకీయ అవసరాలకు రాయితీలుగా ప్రకటించుకుంటు రాజకీయ ఉనికిని చాటుకుంటున్నారు .

ఆంధ్రప్రదేశ్ కు చట్ట బద్దంగా రావాల్సిన 12 వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 50% లాబాల వాటాను ఆంధ్రప్రదేశ్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం నుండి వసూలు చేయాలని , వంటగ్యాస్ సిలెండర్ ను 200/- లకే ఆంధ్రరాష్ట్ర కుటుంబాలకు సరఫరా చేయాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్విగ్నబరితంగా ప్రశ్నించారు.

ఈ సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు ..

ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి ఆర్ మూర్తి , సిమ్మా దుర్గారావు , కారుమూరి యుగంధర్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , మాసా అప్పాయమ్మ , చల్లా సాంబశివరావు , కాకర్ల ప్రసాద్, చల్లా అఖిల్ , సుంకర వెంకట బాస్కర రంగారావు, కందివలస రమణ , కూరాకుల నాగమణి తదితరులు పాల్గొనియున్నారు ..

మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Central and state governments are destroying the green Konaseema

You cannot copy content of this page

Scroll to Top