
Cellar Pit Accident : త్రినేత్రం న్యూస్ : Mar 31, 2026, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం వద్ద మంగళవారం సాయంత్రం సుమారు నాలుగున్నర గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. భవనం కోసం తవ్విన లోతైన సెల్లార్ గుంత కారణంగా పక్కనే ఉన్న భవనంలోని వాష్‌రూమ్ ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న 27 ఏళ్ల సాయికుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. సెల్లార్ తవ్వకాలు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా జరపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

