MLA Balu Naik : సీసీ కెమెరాల ప్రారంభోత్సవం

TRINETHRAM NEWS

నల్గొండ జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ తో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్.
దేవరకొండ సెప్టెంబర్ 24 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి దేవరకొండ పోలీస్ స్టేషన్ నుండి ఎం ఎల్ ఏ బాలు నాయక్ ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ:- నేరాల నియంత్రణతో పాటు నేరగాళ్లను గుర్తించడంలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు కీలకంగా ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి కెమెరాను అనుసంధానం చేసి భద్రతాపరమైన సమస్యలు తలెత్తినప్పుడు క్షణాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారన్నారు.
దేవరకొండ నియోజకవర్గంగలో గ్రామాలలో మరియు పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అదనపు ఎస్పీ మౌనిక , ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CC cameras inauguration

You cannot copy content of this page

Scroll to Top