ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సకాలంలో, నాణ్యతతో పూర్తి చేయాలి.
ఉత్తమ పనితీరు చూపుతున్న అధికారులకు అభినందనలు.
ఎమ్మెల్యే బాలు నాయక్.
దేవరకొండ సెప్టెంబర్ 24 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై దేవరకొండ ఆర్ డి ఓ రమణా రెడ్డి మరియు ఆయా మండలాల ఎంపిడిఓ లతో కలిసి ఎం ఎల్ ఏ బాలు నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. నిర్ణయించిన లక్ష్యం మేరకు అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. దేవరకొండ నియోజక వర్గంలో ఆయా మండలాల వారిగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు, మార్కింగ్ చేసిన ఇండ్లు, నిర్మాణం జరుగుతున్న ఇండ్లు, వాటి పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలాచూడాలనిసూచించారు.
సంబంధిత ఏఈలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. వేగంగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయిస్తున్న అధికారులను అభినందించారు. మిగతా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండ్లు పూర్తి సిద్ధంగా ఉంచాలని సూచించారు. కొన్ని మండలాల్లో నిర్మాణాల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డీ ఓ రమణా రెడ్డి ,అన్ని మండలాల ఎంపిడిఓ లు ,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


