Car Accident : మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం

TRINETHRAM NEWS

Trinethram News : రంగారెడ్డి జిల్లా : రాచకొండ కమిషనరేట్‌కు చెందిన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ నుండి మందమల్లమ్మ చౌరస్తా ప్రధాన రహదారి వద్ద, దాదు నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

అధిక వేగంతో వస్తున్న కారు ఆకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంపై కేసు నమోదు చేసిన మీర్పేట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Car accident in Meerpet police station limits

You cannot copy content of this page

Scroll to Top