Cabinet Meeting : కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్

TRINETHRAM NEWS

Trinethram News : కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

ఖరీఫ్ పంటలకు రూ.2లక్షల కోట్లకు పైగా ఎంఎస్‌పీని ప్రకటించింది. ఈ ఏడాది 8 రోజులు ముందుగానే రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించాయి. అలాగే ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు మేలు చేకూర్చేలా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ పంటకు మద్దతు ధర కోసం రూ.2,07,000 కోట్ల రూపాయలు కేటాయించింది.

అలాగే రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ సబ్వేషన్స్ స్కీమ్ కూడా ప్రకటించింది. ఇక బద్వేలు- నెల్లూరు హైవే 4 లైన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే వార్డా బళ్లార్ష హైవే 4 లైన్ల నిర్మాణం, రత్లాం నాగాడా హైవే నాలుగు లైన్ల నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cabinet takes key decisions

You cannot copy content of this page

Scroll to Top