తేదీ : 25/06/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై ఏడు వ సంవత్సరంలో జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణకు కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని పన్నెండు మంది మంత్రులు నియమితులై ఏర్పాటు చేయడం జరిగింది. వీరిలో ఆనం. రామ నారాయణరెడ్డి, నిమ్మల. రామానాయుడు, వంగలపూడి. అనిత, అనగాని. సత్య ప్రసాద్, వయ్యాపుల. కేశవ్, పొంగూరు. నారాయణ తదితరులు ఉన్నారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవలసినటువంటి చర్యలపై కార్య చర్య ప్రణాళికను ఈ ఉప సంఘం రూపొందించనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


