Hydro Power Project : చిట్టం వలస హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు కోరిన బస్కీ గ్రామసభ

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ అక్టోబర్ 8, (త్రినేత్రం న్యూస్): అల్లూరి జిల్లా, అరకువ్యాలీ మండలం చిట్టం వలస హైడ్రో పవర్ ప్రాజెక్టును రద్దు చేయాలని బస్కీ గ్రామసభలో ఆదివాసీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సర్పంచ్ పాడి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గుడు క్లస్టర్ పెసా కమిటీ కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, ఐదవ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ హక్కులను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవయుగ కంపెనీకి ప్రాజెక్టు అనుమతులు ఇచ్చిందని తీవ్ర ఆక్షేపం వ్యక్తం చేశారు.
గ్రామసభకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరిహద్దు దిమ్మలు పాతిన నవయుగ కంపెనీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు, జీఓ ఎం ఎస్ నెంబర్ 13 తక్షణమే రద్దు చేయాలని గ్రామసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, మాజీ ఎంపీటీసీ బురిడీ దశరథ్, మాజీ సర్పంచ్ కామరాజు, పెసా కమిటీ సభ్యులు కొర్రా మాణిక్యం, పాంగి బాబురావు, ఉప సర్పంచ్ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

cancellation of Chittam Valasa Hydro Power Project

You cannot copy content of this page

Scroll to Top