Local Body Elections : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి

TRINETHRAM NEWS

కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్

త్రినేత్రం న్యూస్. ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు.ముందుగా కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఎస్పీ కి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.సబ్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,1టౌన్ సీఐ కరుణాకర్,3టౌన్ సీఐ శివప్రసాద్ మరియు సబ్ డివిజన్లోని ఇతర పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎటువంటి నేరాలు జరగకుండా ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం అవగాహన కల్పించాలని తెలిపారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.భాధితులకు అండగా ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.అనంతరం డిఎస్పి కార్యాలయ పరిసరాలను పరిశీలించి,అక్కడ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

local body elections

You cannot copy content of this page

Scroll to Top