Borehole Issue : నీరు ఇవ్వని బోరు – నిద్రలోనే ఉన్న అధికారులు

TRINETHRAM NEWS

అరకులోయ డిసెంబర్ 23,( త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం మాడగడ పంచాయతీ పరిధిలోని దానిరంగిని గ్రామంలో తీవ్రంగా మంచినీటి కొరత నెలకొంది. గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారానికి గతంలో బోరు వేసినా, అది చాలా రోజులుగా నీరు సరఫరా చేయకుండా నిరుపయోగంగా ఉందని సీపీఎం పార్టీ మాడగడ పంచాయతీ నాయకులు సమర్డి సత్యారావు, తాంగుల దామోదర్ ఆరోపించారు.
వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో గ్రామ ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ప్రతి సంవత్సరం నీటి ఎద్దడి కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి సురక్షితమైన మంచినీరు లేక ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందన్నారు.
గ్రామంలో ఇప్పటికే బోరు ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, బోరు ద్వారా క్రమబద్ధంగా మంచినీటి సరఫరా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజల మౌలిక హక్కైన తాగునీటిని నిర్లక్ష్యం చేయడం తగదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కొర్ర బలరాం, కొర్ర ధనుర్జయ్, టి. అర్జున్, టి. మహదేవ్, కొర్ర ముత్యాలమ్మ, కొర్ర డొమిని, సమర్డి రంభ, కొర్ర పూర్ణిమ, తాంగుల మొత్తితో పాటు గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువకులు పాల్గొన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Borehole that does not provide water

You cannot copy content of this page

Scroll to Top