IBM SkillsBuild Program : ఐ.బీ.ఎం. స్కిల్స్‌బిల్డ్ ప్రోగ్రామ్ లో ఆర్. ఎస్ .ఆర్. కు, ప్రశంసాపత్రం

TRINETHRAM NEWS
IBM SkillsBuild Program

IBM SkillsBuild Program : త్రినేత్రం న్యూస్ : మార్చ్ 18:నెల్లూరు జిల్లా : కడనూతుల ..నెల్లూరు జిల్లా, బోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బారామి రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (ఆటోనమస్)ను ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ ప్రోగ్రామ్ ద్వారా యువతలో జీవన నైపుణ్యాలు మరియు ఉపాధి సామర్థ్యాల అభివృద్ధికి చేసిన విశిష్ట కృషికి గాను మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రశంసాపత్రంతో మార్చి 17 మంగళవారం నాడు తిరుపతిలో నిర్వహించిన స్టేక్‌హోల్డర్ మీట్ 2026 కార్యక్రమంలో సత్కరించారు.
కళాశాల ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా అమలు చేసి, విద్యార్థుల్లో అవసరమైన జీవన నైపుణ్యాలు మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఈ విజయాన్ని సాధించిన డా. బి. సత్య నారాయణ రెడ్డిని అభినందించింది. అలాగే కళాశాల ప్రిన్సిపల్ డా. పి. వి. ఎన్. రెడ్డి మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ ఆర్. వి. రమణ రెడ్డి ఈ విజయాన్ని ప్రశంసించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top