Bohgi Festival : వినాయక హిల్స్ లో బోగి పండుగ కోలాహలం

TRINETHRAM NEWS

వికారాబాద్.జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జనవరి14 సంక్రాంతి పండుగ సంబరాల లో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు వినాయక హిల్స్‌లో భోగి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామునే కాలనీ వాసులందరూ ఏకమై సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించారు.
ఈ వేడుకలలో బీజేపీ నాయకులు బుస శ్రీకాంత్  కాలనీ వాసులతో కలిసి పాల్గొని భోగి మంటల వేసి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా బుస శ్రీకాంత్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని. పాత ఆలోచనలను, పీడలను భోగి మంటల లో ఆహుతి చేసి, కొత్త కాంతులతో ప్రతి ఒక్కరి జీవితం వెలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు 
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు రాము, కాలనీ పెద్దలు మాధవరెడ్డి, పోకల లక్ష్మణ్ ,దర్శన్ గౌడ్, రాఘవేందర్ , గలయ్య, చారి యువకులు సాకేత్ దినేష్ కాలనీ వాసులు చిన్నారులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bogi festival in Vinayaka Hills

You cannot copy content of this page

Scroll to Top