ఆర్ డి ఓ రమణారెడ్డి.
డిండి (గుండ్ల పల్లి) జులై 09 త్రినేత్రం న్యూస్. అర్హులైన ఓటర్లను గుర్తించి వారికి కల్పించడంలో బి ఎల్ ఓ లదే కీలక పాత్ర అని దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి అన్నారు. తిండి మండల కేంద్రంలో నీ ఎంపీడీవో కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నూతనంగా ఓటు నమోదు చేసుకునే వారికి ఫామ్ 6, విదేశాల్లో ఉన్న భారత పౌరసత్వం కలిగిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు ఫామ్ 6(ఏ) చనిపోయిన వారి పేర్లను తొలగించేందుకు ఫార్మ్ 7, సవరణలకు ఫామ్ 8 ను వినియోగించాలని బి ఎల్ ఓ లకు సూచించారు. ఐదేళ్ల నుండి గ్రామంలో లేని వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించాలని అన్నారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వంతో కూడుకున్నదే ఉండాలనీ సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అంబటి ఆంజనేయులు, శిక్షకులు కే శ్రీనివాస్, గోవర్ధన్ రావు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


