ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Blood Donation Camp

Blood Donation Camp : దేవరకొండ డివిజన్ ,జూలై 3, త్రినేత్రం న్యూస్. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని, శుక్రవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి జ్యోతి ప్రసన్న ,యువజన నాయకులు దేవరన్ నాయక్ హాజరై రక్త దాతలను అభినందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ, రక్తదాన మహా దానమని ,ఒక వ్యక్తి చేసిన రక్తదానం అనేకమంది ప్రాణాలను కాపాడే గొప్ప మానవతా సేవని పేర్కొన్నారు.యువత సేవాభావంతో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, సమాజానికి ఆదర్శం ఇవ్వాలని పిలుపునిచ్చారు.రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన చేసి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ,ఎన్ ఎస్ యు ఐ నాయకులు ,యువజన సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ,వైద్యులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page