Blessings of Sita : సీతా రామచంద్రుల కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి

TRINETHRAM NEWS
blessings of Sita and Ramachandra

తీదేడు గ్రామంలో‌ అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి… తీదేడు గ్రామ సర్పంచ్

Blessings of Sita : చింత పల్లి మార్చ్ 27, త్రినేత్రం న్యూస్. శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.చింతపల్లి మండలం తీదేడు గ్రామం రామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని సీతా రాములవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. వేద పండితుల మంత్రోచరణలు,వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా అంగ రంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగిందని సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..లోక కళ్యాణం కోసం ఎన్నోత్యాగాలను కోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని,రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని ఆమె తెలిపారు.సీతారాముల ఆశీస్సులు అందరిపై ఉండాలని,ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను ప్రార్ధించనున్నట్టు ఆమె తెలిపారు.

ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి అని ఆమె అన్నారు.దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలక వర్గం,గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top