Black Jaggery, Seized : నల్ల బెల్లం , పట్టిక పట్టివేత

TRINETHRAM NEWS
  • అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు.
  • డిండి ఎస్ ఐ. సి హెచ్ బాల కృష్ణ.

డిండి(గుండ్లపల్లి) అక్టోబర్ 08 త్రినేత్రం న్యూస్. డిండి మండలం పరిధిలోని చెరుకుపల్లి గ్రామ సమీపంలో డిండి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తూ ఉన్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో నల్ల బెల్లం పట్టిక ఉండడం గమనించారు వివరాల్లోకి వెళితే.. 08.10.2025 న ఉదయం 3 గంటల సమయంలో చెరుకుపల్లి గ్రామ సమీపంలో డిండి పోలీస్ వారు పెట్రోలింగ్ డ్యూటీ చేయుచుండగా అదే సమయంలో ఒక మహేంద్ర బొలెరో వెహికల్ టీ జి 07యు 6853 దాని డ్రైవర్ పోలీసులను గమనించి అనుమాదాస్పదంగా నడపటంతో అట్టివాహనాన్ని పోలీసు వారు ఆపి తనిఖీ చేయగా అందులో సుమారుగా 75 బస్తాలు లో ఒక్కొక్క బస్తాల 35 కేజీల చొప్పున మొత్తం 2625 కేజీల నల్ల బెల్లం అలాగే ఐదు బస్తాల పట్టిక ఒక్కొక్కటి 40 కేజీలు గలవి మొత్తం 200 కేజీల పట్టిక ను పోలీసు వారు గుర్తించి అట్టి వాహనాన్ని, అదుపులోకి తీసుకుని విచారించగా , గవర్నమెంట్ నిషేధించినటువంటి సారా తయారు చేయడం కోసం ఇట్టి బెల్లంను అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలపడం జరిగింది.

వారి వివరములు కేతావత్ రవి, వయసు 27 సంవత్సరాలు కులం లంబాడా,వృత్తి వ్యవసాయం కొత్త తండా విలేజ్ మరియు రమావత్ రమేష్ గద్దె వెంకటేష్ అనువారు ఇటి అక్రమ రవాణాను చేయడం జరిగింది . ఇట్టి వారి పైన డిండి ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేయడంజరిగింది, ఇట్టి అక్రమ రవాణాలు జరిపిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డిండి ఎస్ఐ బాలకృష్ణ హెచ్చరించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Black jaggery, seized

You cannot copy content of this page

Scroll to Top