అల్లూరిజిల్లా (అరకు లోయ)త్రినేత్రంన్యూస్ జూలై 5 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మె విజయవంతం కావాలన్న లక్ష్యంతో అరకు వ్యాలీలో సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసి, ధనవంతులకు లాభాలు చేకూర్చేలా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని విమర్శించారు. పాత కార్మిక చట్టాల అమలే ఏకైక మార్గమని పేర్కొన్నారు. గిరిజనుల హక్కులను నిర్లక్ష్యం చేస్తూ ఐదవ షెడ్యూల్ నిబంధనలను పక్కన పెట్టి, హైడ్రోపవర్ ప్రాజెక్టుల పేరిట ఆదానీలకు భూములు అప్పగిస్తున్నదని ఆరోపించారు.
ఇప్పటికే జీవో నెంబర్ 3 రద్దుతో నిరుద్యోగులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ విధానాలపై గిరిజనులు, కార్మికులు ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జూలై 9 సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు, అరకు మండల కన్వీనర్ భగత్ రామ్, ఐటిడిఏ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దాడి రాజు, ఏపీ టూరిజం వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్మ, సురేష్, ఆదివాసి గిరిజన సంఘ నాయకులు బుజ్జిబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


