రైతు సంస్కృతికి ప్రతీక మకర సంక్రాంతి పండుగ…
కొత్తపేట, రావులపాలెంలలో సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…
త్రినేత్రం న్యూస్, రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఇంటికి చేరే సమయంలో చేసుకునే పండుగ మకర సంక్రాంతి అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట,రావులపాలెం లలో ఆయన బుధవారం భోగి పండుగ సందర్భంగా భోగి మంటలను వెలిగించి పండుగ సంబరాలను ప్రారంభించారు.
కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంక్రాంతి పండుగ వేడుకగా జరుపుకోవాలని అన్నారు. జూదాలకు దూరంగా ఉండి ఆహ్లాదకరమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


