జూలై 16, 2026
TRINETHRAM NEWS
Bhavani Ramalingeswara Swamy blessed

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తీదేడు గ్రామ సర్పంచ్

Bhavani Ramalingeswara Swamy : చింత పల్లి మే 21, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దక్షిణ మండపం నిర్మాణానికి గ్రామ ప్రజలు,యువత స్వచ్ఛందంగా విరాళాలు అందించడం అభినందనీయమని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్ అన్నారు.

ఈ సందర్భంగా తీదేడు గ్రామానికి చెందిన అవిరినేని నరేందర్ రావు,మర్రు రాఘవేందర్ రావు,మర్రు చంద్రశేఖర్ రావు,రూ.5,00,116/- (ఐదు లక్షల నూట పదహారు రూపాయలు),మోర ధనమ్మ కృపాచారి 1,11,116 (ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు),బొంతల లలిత 1,00,116 (ఒక లక్ష నూట పదహారు రూపాయలు),మొరుపోజు లక్ష్మిపతి,మొరుపోజు శంకరాచారి లు 51,116 (యాబై ఒక్క వేల నూట పదహారు రూపాయలు),కండె పద్మ కుమారులు కండె సాయి, కండె నిలేష్ 30,116/-( ముఫై వేల నూట పదహారు రూపాయలు) విరాళాలు అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…శ్రీ శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దక్షిణ మండప నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలు ఐక్యంగా ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page