జూలై 5, 2026
TRINETHRAM NEWS
Woman Body Found

Woman Body Found : త్రినేత్రం న్యూస్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండా గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మహిళ మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. బావిలో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

మృతురాలు మల్లయ్యకుంట గ్రామానికి చెందిన మహిళగా స్థానికులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఆమె మృతి ఎలా జరిగింది..? ప్రమాదవశాత్తు బావిలో పడిందా..? లేక ఇతర కారణాలున్నాయా..? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బావి నుంచి బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page